తీరుమారని టీడీపీ

3

కుట్ర@ ఆంధ్రోళ్లు

విజయన్‌కు ఓటు వేయమని టీడీపీ అఫీషియల్‌ పేజ్‌ మెసేజ్‌పై మండిపడ్డ తెలంగాణ బిడ్డలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్ర పార్టీ తెలుగుదేశం కుట్రలకు మరోసారి  తెరలేపిందని టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. తెలుగువారంతా ఒక్కటే అని పదేపదే చెబుతున్నవారు సీఎన్‌ఎన్‌ ఇండియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఓటింగ్‌లో కేరళ విజయన్‌కు ఓటేయాలని అధికారికంగా పేర్కొనడంపై మండిపడ్డారు. ఈ నామినేషన్లలో ముందున్న సిఎం కెసిఆర్‌కు ఓటేయాల్సిన వారు కేరళ వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైన కేసీఆర్‌ను నిలవరించాలనే దురుద్దేశంతో తెలంగాణ నాయకున్ని గెలవకుండా చేయలనే కుటిల ప్రయత్నం మొదలుపెట్టారని మండిపడ్డారు.  సీఎన్‌ఎన్‌ ఇండియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఓటింగ్‌లో సీఎం కేసీఆర్‌ 31శాతం  ఓటింగ్‌ తో ముందున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌  ముగియబోతున్న తరుణంలో టిడిపి కీలక నిర్ణయం తీసుకుని తన ఓటును విజయన్‌కు వేయాల్సిందిగా సూచించింది. దీంతో వెనుకంజలో ఉన్న వెనుకంజలో ఉన్న విజయన్‌ ఇప్పుడు 31 శాతం  ఓట్లతో కేసీఆర్‌ తో సమానంగా ఉన్నాడు. ఆదివారం  మధ్యాహ్నం వరకు 21శాతం ఓటింగ్‌ తో వెనుకబడి ఉండటం వల్ల కేసీఆర్‌ గెలవటమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మార్ప కనిపించింది. దీంతో టిడిపి  పార్టీ తన కుటిల బుద్దిని బయటపెట్టిందని టిఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. కేసీఆర్‌ గెలిస్తే క్రెడిట్‌ ఆయనకే పోతుందని బావించి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది. పి.విజయన్‌ కే ఓటు వేయమంటూ టీడీపీ ఆఫిషియల్‌ పేజీ నుంచి ఓ మెసేస్‌ ను సర్య్కులేట్‌ చేసింది. ఆ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌ దమ్ము సినిమా విషయంలో కూడా ఇదే విధంగా విషం చిమ్మిన విషయం ఎప్పటికీ మరవలేం. స్వరాష్ట్ర సాధనలో తన ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమనాయకుడు కేసీఆర్‌. అలాంటి కేసీఆర్‌ కు దక్కిన అరుదైన గౌరవం ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లో నామినేట్‌ కావడం. తెలుగు వాళ్ళమంతా కలిసే ఉండాలి, తెలుగు జాతి ఆత్మ గౌరవం అంటూ స్పీచులిచ్చే ఆ పచ్చ పార్టీ తెలుగు వాడి గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చిల్లర ప్రచారం మొదలు పెట్టింది. ఆ మెసేజ్‌  ఇప్పడు నెటిజన్లను కూడా షాక్‌కు గురిచేసింది. ఇదిలావుంటే ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మిషన్‌ కాకతీయపై అవగాహన సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, టి. హరీశ్‌రావు హాజరయ్యారు. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలపై, రుణమాఫీ, యాంత్రీకరణ అమలుపై అధికారులతో వారు సవిూక్ష చేపట్టారు.