స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో రమాదేవికి అందచేశారు.
శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రభుత్వం, ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు అయన తెలిపారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


