దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు
దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ సరఫరా
బ్లాక్ మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం
పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం
ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మరోసారి ప్రకటన
న్యూఢిల్లీ(జనంసాక్షి): పైపులతో నేచురల్ గ్యాస్ కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, పెట్రోల్, డీజిల్‌కు దేశంలో ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో కూడా మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారంనాడు ప్రకటించింది. వదంతులు నమ్మవద్దని కోరింది. గహావసరాల కోసం వందశాతం పీఎన్‌జీ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. ఈ మేరకు నోటీఫికేషన్ ఇచ్చామని, నిర్దిష్ట కాలపరిమితి లోపు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ మౌలిక వసతుల అభివద్ధి జరగనుందని చెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఎల్పీజీ, ఇంధనం కొరతపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ప్యానిక్ బైయింగ్‌కు పాల్పడవద్దని కోరారు. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఏటా 26 కోట్ల టన్నుల రిఫైనరీ సామర్థ్యం మనకు ఉందని చెప్పారు. గత రెండు రోజులుగా రిటైల్ ఔట్‌లెట్‌లు, పెట్రోల్ బంకుల వద్ద పెద్దఎత్తున జనం క్యూలు కడుతుండటం తమ దష్టికి వచ్చిందని, అయితే ఆందోళన అవసరం లేదని, దేశంలో తగినన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్, డిజిల్ ధరలు కూడా పెరగబోవడం లేదని వివరించారు. వలస కార్మికులకు ప్రాధాన్యతా క్రమంలో 5 కిలోల సిలెండర్లు అందిస్తామని సుజాతా శర్మ తెలిపారు. 26 రాష్టాల్రకు 22,000 టన్నుల ఎల్పీజీ కేటాయించామన్నారు. మంగళవారంనాడు 30,000 ఐదు కేజీల సిలెండర్లు ఇచ్చామని చెప్పారు. బ్లాక్‌మార్కెటింగ్, అక్రమ నిల్వలకు కళ్ళెం వేసేందుకు 2,700 దాడులు జరిపామని, 2,000 సిలెండర్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై వస్తున్న వార్తలు నిజం కాదనీ, గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవనీ సుజాత శర్మ వివరించారు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రావిÖణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుందని సుజాత శర్మ స్పష్టం చేశారు. ఇదిలావుంటే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించడం సహా గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్(పీఎన్‌జీ) సరఫరా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెంటనే దానికి మారాలని ఆయా వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. దేశంలో పీఎన్‌జీని ప్రోత్సహించే దిశగా ముందడుగు వేస్తున్న కేంద్రం.. ఈ మేరకు 3 నెలల గడువు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఎల్‌పీజీ సిలిండర్లను మౌలిక సదుపాయాలు లేని ఏరియాలకు మళ్లించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. పీఎన్‌జీకి మారడం వల్ల రీఫిల్ బుక్‌చేసే అవసరముండదు. దీంతోపాటు నిరంతర గ్యాస్ సరఫరా అందుబాటులో ఉంటుంది. అయితే.. పీఎన్‌జీ సరఫరాలో సాంకేతిక సమస్యలు, ఇంటికి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడం అసాధ్యమైన సందర్భంలో మాత్రమే ఎల్‌పీజీ సరఫరా కొనసాగుతుంది.కానీ.. దానికి పీఎన్‌జీ గ్యాస్ కంపెనీ నుంచి నిరభ్యంతర పత్రంతప్పనిసరి. మేరకు పీఎన్‌జీ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు పలు చర్యలు చేపట్టింది కేంద్రం. పైప్డ్ గ్యాస్ లైన్‌కు నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతులు మంజూరు చేయాలి. నిర్దేశిరచిన ఫీజుకంటే ఎక్కువ వసూలు చేయకూడదు. హౌసింగ్ సొసైటీలు లేదా భూయజమానులు కూడా పైపులైన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదు. అలాంటి సందర్భాలేమైనా తలెత్తితే ఆ ప్రాంతానికి ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయడం సహా సంబంధిత వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. వీటి అమలును పర్యవేక్షించడం సహా సమ్మతిని నిర్దారించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డ్ నోడల్ అథారిటీకి బాధ్యతలు అప్పగించింది.
యుద్ధ నష్టపరిహారం చెల్లించండి
` హర్మూజ్ జలసంధిపై సార్వభౌమాధికారాన్ని కల్పించండి
` కాల్పుల విరమణ ప్రతిపాద చేసిన ఇరాన్
` పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలకపరిణామం
` అబ్రహం లింకన్‌పై ఐఆర్‌జీసీ బాంబుల వర్షం
` హెచ్చరిక చేసిన గంటల్లోనే దాడులు
` కువైట్ విమానాశ్రయంపై దాడి
` యుద్ధం ముగింపుకు ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు
` ఇరాన్‌కు 15 డిమాండ్ ముందు పెట్టిన ట్రంప్
` 450 కిలోల యురేనియం అప్పగించాలని షరతు
` ఇరాన్‌ను సైనికంగా అంతమొందించామని ప్రకటన
` అది ఒప్పందం కాదు..మీ ఓటమి
` శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ పోరాడతాం
` ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్
టెహ్రాన్(జనంసాక్షి):పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధ నష్టపరిహారం, హార్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికారాన్ని కోరుతూ కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది.అంతకుముందు పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎసఎస్ అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే దాడి చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ విÖడియా విడుదల చేసింది.యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులోభాగంగానే నెల రోజుల కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను ఇరాన్‌కు పాకిస్థాన్ అందించింది. ఇలాంటి సమయంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపై ఆందోళన నెలకొంది. అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల పేర్కొంది. ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా తోసిపుచ్చింది.
యుద్ధం ముగింపుకు ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు
పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులోభాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపించేందుకు అమెరికా సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ శాంతి ప్రణాళికను పాకిస్థాన్ ప్రతినిధుల ద్వారా అమెరికా ఇరాన్ (ఎసజీని)కు పంపించినట్లు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఈ సీజ్‌ఫైర్ గురించి ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే, ఈ కథనాలపై వైట్‌హౌస్ నుంచి స్పందన రాలేదు. యుద్ధం ముగింపు కోసం ఈ ప్రణాళికలో టెహ్రాన్‌కు కొన్ని షరతులు విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నిలిపివేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్‌కు 15 సూత్రాలతో కూడిన వివరణాత్మక కాల్పుల విరమణ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ విÖడియా కథనాల ప్రకారం.. ఈ ప్రణాళికను పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా అందించారని తెలుస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కొత్త చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు కూడా పాకిస్థాన్ ముందుకొచ్చింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించిన సుమారు 50వేల మంది సిబ్బందికి తోడు మరో వెయ్యి మంది సైనికులను పంపేందుకు యూఎస్ సైన్యం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ దౌత్యపరమైన చర్య చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలతో పాటు 2 మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లను కూడా పశ్చిమాసియాకు పంపుతోంది అమెరికా. ఇవి సుమారు 5వేల మంది మెరైన్‌లు సహా వేల మంది సైనికులను తీసుకువస్తాయి. మరోవైపు.. ఇరాన్‌పై తమ సైనిక ఒత్తిడిని కొనసాగించాలని అమెరికాను పట్టుబడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా చర్యలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ రీతిలో వాషింగ్టన్ కాల్పుల విరమణ ప్రణాళికను ముందుకు తెస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేదని విÖడియా కథనాలు నివేదిస్తున్నాయి.యుద్దాన్ని ముగించేందుకు కఠినమైన షరతులను విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అందులో యురేనియం శుద్ధిని నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం సహా అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా కీలక చర్యలున్నాయి.ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయయడం. ఇరాన్ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివద్ధి చేయబోమని హావిÖ ఇవ్వడం. ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతించక పోవడం.సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించడం. నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయడం.ఇరాన్ వ్యాప్తంగా ఐఏఈఏకు పూర్తి పారదర్శకత కల్పించడం.ఇరాన్ తన ప్రాంతీయ మధ్యవర్తిత్వ కార్యకలాపాలను నిలిపివేయడం.మిత్రపక్ష మిలీషియాలకు మద్దతును నిలిపివేయడం. హోర్ముజ్ జలసంధిని ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచడం.ఇరాన్ క్షిపణి పరిధిని, పరిమాణాలను పరిమితం చేయడం.
భవిష్యత్తులో క్షిపణి వినియోగం కచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించడం. పైన పేర్కొన్న పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌కు అమెరికా పంపినట్టు సమాచారం.
ఇరాన్‌పై యుద్ధం గెలిచాం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాము గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రటించుకున్నారు. ఈ పోరులో ఇరాన్‌ను సైనికపరంగా అంతమొందించామని ఆయన అన్నారు. ఆ దేశం ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివద్ధి చేయకూడదనేదే తమ మొదటి షరతు అని.. దానికి ఇరాన్ అంగీకరించిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ’ఇరాన్‌తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వారి నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమవడం సహా రాడార్ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికా విమానాలు టెహ్రాన్ విÖదుగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే.. అమెరికా ఏదైనా చేయగలదు’ అని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఇరాన్.. అమెరికాకు హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఓ పెద్ద గిప్ట్ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. అయితే.. ఆ బహుమతి ఏంటనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అది చాలా విలువైన గిప్ట్ అని చెప్ప్పుకొచ్చారు. అయితే.. ట్రంప్ వ్యాఖ్యాలను పూర్తిగా తోసిపుచ్చింది ఇరాన్. అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలతో కలిసి ఇరాన్.. అమెరికాతో మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇటీవల అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్టు పాక్ విÖడియా సంస్థలు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు.. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్‌పై దాడులను కొనసాగించాలని ట్రంప్‌ను కోరినట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. యుద్దానికి ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినప్పటికీ.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా బాలిస్టిక్ క్షిపణి ఇరాన్‌కు చెందిన 6 డ్రోన్‌లను కూల్చివేసింది. తూర్పు ప్రావిన్సులో తమ వాయు రక్షణ వ్యవస్థ ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఆ వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో కనీసం 6 డ్రోన్‌లను కూల్చివేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్, కువైట్ దేశాలపైనా ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తున్నట్టు అంతర్జాతీయ విÖడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా దాడులకు దిగాయి. అందులో ఒక డ్రోన్ విమానాశ్రయ పరిసరాల్లోకి దూసుకువచ్చి అక్కడే ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదం దాటికి ట్యాంకర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. విమానాశ్రమం పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ డ్రోన్లతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజా దాడి కువైట్ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంటలు అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇరాన్ నుంచి వచ్చిన పలు డ్రోన్లు, క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్రువీకరించింది.
అది ఒప్పందం కాదు..మీ ఓటమి: ఇరాన్
ఈ సీజ్‌ఫైర్ ప్లాన్‌పై ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి స్పందిస్తూ అమెరికాపై విమర్శలు గుప్పించారు. “విÖ ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవొద్దు. ఈ ప్రాంతంలో విÖ పెట్టుబడులను మేం అంగీకరించబోం” అని ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో చర్చల వార్తలను కూడా ఖండించారు. యుద్ధం ముగించే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటుండగా.. ఇరాన్ అధికారుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమెరికా` ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణకు.. వారు పశ్చాత్తాప పడేవరకూ తమ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన చర్చించారు. ఈ క్రమంలోనే అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక విÖడియా తెలిపింది.ఇరాన్ పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడమే.. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణమని అరాగ్చీ పేర్కొన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరి.. హింసాత్మక దురాక్రమణకు పాల్పడినందుకు గాను శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు కొనసాగుతాయన్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ మొదటి ప్రాధాన్యం అని వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో సహా తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు.
ఇరాన్ నేతలకు ఇమ్యూనిటీ..
ఇదిలాఉండగా.. అమెరికా` ఇరాన్ మధ్య దౌత్య చర్చలకు అడుగులు పడుతుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాటు పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్‌కు అమెరికా` ఇజ్రాయెల్ తాత్కాలిక రక్షణ కల్పించాయి. చర్చలు కొనసాగుతున్నంతకాలం ఈ రక్షణ ఉంటుందని ఇజ్రాయెల్ విÖడియా పేర్కొంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.



