బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి

హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు

బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్ 

గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ లక్ష్యమని సంఘాలు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందాయని దేశం అభివృద్ధి చెందుతుందని పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలకు కుల సంఘాలకు నిధులు మంజూరు చేస్తూ గంభీరావుపేట మండలంలోని అనేక కుల సంఘాల అభివృద్ధి కోసం తన యొక్క ఎంపీ నిధుల నుండి మండలంలోని ముదిరాజ్ సంఘం నాయి బ్రాహ్మణ సంఘం యాదవ సంఘం రెండు మున్నూరు కాపు సంఘాలకు నర్మల రజక సంఘం పొన్నాల పల్లె మున్నూరు కాపు సంఘం లింగన్నపేట వడ్డెర సంఘం కొత్తపల్లిలోని వివిధ సంఘాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు గంభీరావుపేట లోని అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని మరియు కేంద్ర ప్రభుత్వ నిధులైనటువంటి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సిసి రోడ్ల నిర్మాణం మహిళా సంఘాల భవనాలు నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు గ్రామాల్లో నాయకులు మరియు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాని సందర్భంగా బిజెపి మాజీ మండల అధ్యక్షుడు గంటా అశోక్ తెలియజేశారు