ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి


అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి
అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు
ఖర్గ్ ఐలాండ్‌లో మందుపాతరలు
పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..!
టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర’ (ఐఆర్‌జీసీ) నౌకాదళ చీఫ్ అలీరెజా తంగ్సిరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన దాడుల్లో ఆయనతోపాటు మరికొందరు సీనియర్ నౌకాదళ కమాండర్లు మతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. దీనిపై ఇరాన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. 2018 నుంచి అలీరెజా నేవీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేతను ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు అంతర్జాతీయ విÖడియా కథనాలు తెలిపాయి.పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణి శిథిలాలు విÖదపడి అబుధాబీలో ఇద్దరు మతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని కెఫర్ ఖాసీం ప్రాంతంలో ఐదుగురు, టెలఅవీవ్‌లో ఇద్దరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం, అణు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిశ్రమలపైనా దాడులు చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. లెబనాన్‌లో ఓ సైనికుడు మతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇరాన్‌కు తాము డ్రోన్లు సరఫరా చేస్తున్నామనే కథనాలను రష్యా ఖండించింది.
అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అబుధాబీపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నట్లు వెల్లడైంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా అడ్డుకున్నప్పటికీ.. క్షిపణి శిథిలాలు విÖద పడి వీరిద్దరూ చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన మరో వ్యక్తిని పాక్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అబుధాబీ క్షిపణి దాడి ఘటనలో మరో ముగ్గురు గాయపడగా.. వీరిలోనూ ఒకరు భారతీయుడు ఉన్నట్లు యూఏఈ విÖడియా విభాగం వెల్లడించింది. మరో ఇద్దరు యూఏఈ, జోర్డాన్‌లకు చెందిన వారని పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి ఎలాంటి వదంతులను పౌరులు నమ్మవద్దని, అధికారుల నుంచి ధ్రువీకరించుకోవాలని సూచించింది. మరోవైపు, యూఏఈపై ఇరాన్ దాడులను జోర్డాన్ ఖండించింది. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగించే చర్యలేనని పేర్కొంది.
పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..!
అమెరికా`ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోన్న ఇరాన్‌కు రష్యా నుంచి సహాయం అందుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి పుతిన్ ప్రభుత్వం దశలవారీగా డ్రోన్లను డెలివరీ చేస్తోందని అంతర్జాతీయ విÖడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరుకు ఆ రవాణా పూర్తికానుందని వెల్లడించాయి. డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలను కూడా పంపిస్తోందని రాసుకొచ్చాయి. “ ఇరాన్ అభివద్ధి చేసిన డ్రోన్లను రష్యా తయారుచేస్తోంది. వాటిని ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ షిప్‌మెంట్లు చేస్తోంది” అని పశ్చిమదేశాల నిఘా సమాచారాన్ని ఉటంకించాయి.అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్ (ఎతీజీని)కు రష్యా ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స’ సహకారం అందిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని వాటి సారాంశం. ఇక తాజా కథనాలపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు. “ప్రస్తుతం చాలా నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. ఇరాన్ నాయకత్వంతో మా సంప్రదింపులు కొనసాగిస్తున్నాం” అని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి తన ఉద్యోగులను రష్యా వెనక్కి రప్పించింది. మంగళవారం ఈ ప్లాంట్‌పై క్షిపణి పడిన నేపథ్యంలో 163 మంది సిబ్బందిని అక్కడినుంచి తరలించింది. ఈ ప్లాంట్‌ను నిర్మించింది రష్యానే. మిగతా యూనిట్ల నిర్మాణం కోసం అక్కడ కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి అక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది.
ఖర్గ్ ఐలాండ్‌లో ఇరాన్ మందుపాతరలు
ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా తన బలగాలను మోహరిస్తోందని వార్తలు వస్తున్న ఈనేపథ్యంలో ఖర్గ్‌ను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా దళాలను అక్కడ అడుగుపెట్టనీయకుండా ఇరాన్ భారీగా మందుపాతరలు అమర్చినట్లు సమాచారం. వాటితో విధ్వంసకర ఉచ్చులు పన్నుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడికి భారీగా బలగాలను కూడా తరలిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. హర్మూజ్ జలసంధిని తెరిపించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గ్‌ను ఓ సాధనంగా వాడాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలోని ఓ దేశం సహకారంతో ద్వీపాలను ఆక్రమించు కోవాలని మా శత్రువులు సన్నాహాలు చేస్తున్నారన్న నిఘా సమాచారం ఉంది. శత్రువుల కదలికలను మేం ఎప్పటికప్ప్పుడు పర్యవేక్షిస్తున్నాం. శత్రువు ఒక్క అడుగు ముందుకువేసినా.. పశ్చిమాసియాలోని ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఎడతెగని దాడులు చేస్తాం అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలిబాఫ్ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. అమెరికా సైనికులు, కమాండర్ల ఆచూకీ చెప్పండంటూ పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ (ఎసజీని) విజ్ఞప్తి చేసింది. అమెరికా స్థావరాలపై తాము దాడులు చేస్తుండటంతో అక్కడున్న యూఎస్ సైనికులు ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఇరాన్ వెల్లడించింది. పశ్చిమాసియా దేశాల ప్రజలు వారి ఆచూకీని వెల్లడించాలని కోరుతున్నాం. అలాగే విÖ భద్రత కోసం వారిని బహిష్కరించండని అడిగింది. తమ దాడుల్లో దెబ్బతిన్న అమెరికా స్థావరాలు నిర్జన ప్రాంతాలుగా మారాయని పేర్కొంది. 13 సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. భూతల దాడుల వార్తల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. నెతన్యాహు, ట్రంప్ చేస్తోన్న మోసానికి విÖ పిల్లలను బలిచేయకండంటూ హెచ్చరించింది.