తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
మార్చి 27 ( జనం సాక్షి ): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, ఆద్వికగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


