తుదిదశకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనుల

పరిశీలించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి,జూలై23(జనంసాక్షి): ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో నర్సింగ్‌ కళాశాల నిర్మాణం పూర్తవుతుందని, తుది దశకు కళాశాల నిర్మాణ పనులు చేరాయన్నారు. ఐదుల్యాబ్‌లు, రెండు లెక్చర్‌ హాళ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణకు అనుగుణంగా భవనాలు సిద్ధమయ్యాయని, అనుమతులు పూర్తయిన వెంటనే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో వనపర్తి మెడికల్‌ కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో కళాశాల, వసతిగృహాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వనపర్తి మెడికల్‌ కళాశాల క్యాంపస్‌ మిగతా కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు అనడంలో సందేహం లేదన్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి అన్నివిధాలా అనుకూల వాతావరణం ఉందన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, ఆయాశాఖల అధికారులు ఉన్నారు