తుర్కపల్లి గ్రామం మరింత అభివృద్ధి చేసుకుందాం

ముస్తాబాద్ జూన్ 27 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్  ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ (బాడీ) మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్  మాట్లాడుతూ  పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేస్తూ, నూతనంగా నిర్మించుకున్న గ్రామపంచాయతీ భవనాన్ని త్వరలో నే  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిచే ప్రారంభించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బోర్ కి మరమ్మతులు చేపించి తాగునీటి సరఫరా గురించి చర్చించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ జవ్వాజి కృష్ణవేణి, వార్డు మెంబర్లు కాసోల్ల రామస్వామి, మచ్చ రాజు,కర్రోల్ల నర్సింలు,జెల్లా రాజు,అంకని దుర్గవ్వ, చింతకింది నరసవ్వ, గ్రామ కార్యదర్శి సిద్ధుల శ్రీనివాస్ కారోబార్ పరుశరాములు, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.