తెదేపా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కాలికి గాయం

కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ ఈరోజు తెదేపా నాయకులు కరీంనగర్‌ ఎన్‌ఈ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఎన్‌ఈ కార్యాలయం ముట్టడికి యత్నించినప్పుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కిందపడడంతో కాలికి గాయమైంది. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు.