తెరాస అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యువనాయకుల కృషి

బిచ్కుంద అక్టోబర్ 22 (జనంసాక్షి) మునుగోడు నియోజకవర్గంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గ గ్రామాలు రవిగూడెం, జమస్థానపల్లి, సనబండ, జక్కవారి గూడెం తదితర గ్రామాల ఓటర్లు హైదరాబాద్ లో నివసిస్తున్న వారిని కలిసి తెరాస పార్టీ బలపరిచిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మునుగోడు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జుక్కల్ నియోజకవర్గ యువనాయకులు వేడుకుంటున్నారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు హరీష్ షిండే, నియోజకవర్గ యూత్ ఇంచార్జ్ శివ గౌడ్, పాకలి శ్రీనివాస్, మహేష్ పటేల్, పండరీ సింగ్, అభిషేక్ మరియు ఈర్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు.