తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ అరెస్టు

సిద్ధిపేట : బయ్యారం గనులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌లో భాగంగా సిద్ధిపేట బస్‌డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు హరీశ్‌రావు సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.