తెరాస చేసిన అభివద్ధిని చూసి ఓటెయ్యండి
జగిత్యాల,నవంబర్11(జనంసాక్షి): రాయికల్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో తెరాస యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు చేసిన అభివద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి తెరాస జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ప్రజలు తెరాస కార్యకర్తలను అక్కున చేర్చుకుంటున్నారని, మేమున్నామని బలమిస్తున్నారన్నారు. కెేసిఆర్ ను పెద్దకొడుకుగా భావించి ఓట్లు వేసెందుకు సిద్ధంగా వున్నామని, తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని పెద్ద మెజారిటీతో గెలిస్తేనే అభివ ద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, ప్రజల మద్దతు బలంగా ఉందని అన్నారు. సంజయ్ అన్నని అసెంబ్లీ పంపడం ఖాయమని పలువురు ఆనందోత్సవాలతో తెలుపుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టన యువజన అధ్యక్షులు మోర రామ్మూర్తి ,ఎంపీటీసీ శంకరయ్య, యువనాయకులు చల్లా సురేష్ గౌడ్, జోగిని పెళి తిరుపతిగౌడ్, చాంద్ పాషా, వెంకటేష్, జలేందర్, గణేష్ సోహెల్, చంద్రతేజ’, ప్రసాద్, చిలుక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




