తెలంగాణకు అప్పుడు వైఎస్..ఇప్పుడు జగన్ అడ్డు
కరీంనగర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి అడ్డుకుంటే, ఇప్పుడు అక్రమ సంపాదనతో జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు అడ్డుపడుతున్న పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని తెలియజేశారు.