తెలంగాణకు టీడీపీ వ్యతిరేఖం కాదు:చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేఖం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాయి. ఇవాళ ఆయన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పటికి టీడీపీ తెలంగాణను వ్యతిరేఖం కాదన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా, తెలంగాణ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కరుతున్నా. అఖిలపక్షంలో మా పార్టీ వైఖరిని స్పష్టంగా చెబుతాం తెలంగాణ సమస్యకు కేంద్ర ప్రభుత్వమే ఒక పరిష్కారం చూపాలని చంద్రబాడు అన్నారు. కొందరు కావాలనే టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారని ఆయన విమర్శించారు.