తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి
` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్టాల్రకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని 16వ ఆర్థిక సంఘానికి సూచించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ బనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో పలు రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కేపీ వివేకానంద హాజరయ్యారు. తొలి రోజు 16వ ఆర్థిక సంఘం ముగిసిన అనంతరం హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు.16వ ఆర్థిక సంఘానికి బీఆర్‌ఎస్‌ తరపున పలు ప్రతిపాదనలు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. రాష్టాల్రకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని సూచించామని అన్నారు.  బాగున్న రాష్టాన్రికి తక్కువ నిధులు వచ్చేలా ప్రస్తుత విధానం ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న రాష్టాల్రకు అన్యాయం జరుగుతోంది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బాగా పని చేస్తున్న రాష్టాన్న్రి ప్రోత్సహించే విధానాలు ఉండాలి. పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగా లేవు. పట్టణీకరణ పెరుగుతున్న తెలంగాణ వంటి రాష్టాల్రకు నష్టం జరుగుతోంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు మాత్రమే సాధ్యమవుతాయి. ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నిధులు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగా లేవన్నారు. ఇంటింటికి నీరు కోసం కేంద్రం హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ, దాన్ని రాష్ట్రంలో మిషన్‌ భగీరథ రూపంలో గతంలోనే అమలు చేశాం. మిషన్‌ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినా నిధులు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం సూచనల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం పాటించలేదు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరి స్తోందని విమర్శించారు.