తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

 

తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

హైదరాబాద్‌ : తెలంగాణకు అసలైన బద్ధశత్రువు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధు యాష్కీగౌడ్‌ అన్నారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ససేమిరా ఇష్టం లేదన్నారు. వీరిద్దరూ తెలంగాణకు బద్దశత్రువులన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు తనని పిలిపించి రాజకీయ జీవితం నాశనం చేస్తానని వైఎస్‌ బెదిరించారని మధుయాష్కీ ఆరోపించారు. మంత్రులకు, నాయకులకు తాయిలాలిచ్చి వైఎస్‌ జగన్‌కు వేల కోట్లు దాటిపెట్టారని ఎంపీ మధుయాష్కీ అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ కార్యాలయానికి రాని మాట వాస్తవేనని, వైఎస్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌, విజయ కలిసి ఫోన్లోనే రాయబారాలు, బేరసారాలు సాగించారంటూ ఘాటుగా విమర్శించారు.