తెలంగాణకు మోస్ట్‌ ప్రొమిసింగ్‌ స్టేట్‌ అవార్డు

3

న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయస్ధాయి గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు అవార్డులు, ప్రసంశలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టెట్‌ అవార్డు దక్కించుకున్నది. ప్రతి ఏడాది అఔఃఅ ుహ18 నిర్వహించే ‘ఎనిటతిజీ ఃబీబతినివబబ ఒవజీటవతీ ంలిజీతీటబ’ లో భాగంగా రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. జాతీయ స్ధాయిలో ప్రభుత్వాలకు, పరిశ్రమ, క్రీడా, సామాజిక, కళ, వినోద రంగాల్లోని విజేతలకు అవార్డులను ప్రతి ఏటా సియన్‌ బిసి గ్రూప్‌ ప్రధానం చేస్తున్నది. ఈ అవార్డుల ఎంపిక కోసం పలు అంశాలనను ప్రమాణికంగా తీసుకుంటున్నది.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన, పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకున్న సియన్‌ బిసి రాష్ట్రానికి అ అవార్డును ప్రకటించింది. గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రముఖులను సత్కరించింది. ఈ నెల 30 తేదిన డీల్లీలో జరిగే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అహ్వనాన్ని సిన్‌ బిసి గ్రూప్‌ పంపింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ అవార్డు ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా హజరవుతారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కెటి రామారావు అవార్డుని స్వీకరిస్తారు. కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, స్మ్రితి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ వంటి కేంద్ర మంత్రుల ప్యానెల్‌ డిస్కషన్‌ ఉంటుందని సియన్‌ బిసి గ్రూప్‌ తెలిపింది.తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఇప్పటికే అనేక సంస్ధలు, ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయని, దేశంలో ఇతర రాష్ట్రలతో పోటీపడినప్పటికీ, తెలంగాణకే అ వార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలనకు, పారదర్శకతకు, విజన్‌ కు ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వరుసగా పలు అవార్డు రావడం వివిధ రంగాల్లో తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందన్నారు.