తెలంగాణపై ఎందుకింత నిర్లక్ష్యం?
` ఆరు కి.మీ ఫ్లైఓవర్‌కు ఆరు సంవత్సరాలు పడుతుందా!
` సిగ్గు సిగ్గు: మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): ఉప్పల్` నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, అధికారులతో కలిసి పరిశీలించారు.2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో 6 కిలోవిూటర్ల పై వంతెన పూర్తి చేయలేదంటే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని అధికారులను ఆదేశించారు.’’కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతో. వంతెన నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ చర్చలో పాల్గొనేందుకు విూరు అర్హులు కారు. త్వరిత గతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి విూ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? గుత్తేదారుపై పూర్తి నెపం నెట్టడం కాదు.. విూరు చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేక పోయారు. జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్, కాంట్రాక్టర్ అంటూ సాకులు చెప్పొద్దు’’ అని మండి పడ్డారు. ఈనెల 8వ తేదీ నుంచి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో తెలిపారు. సెప్టెంబరు చివరి కల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండర్ పనులు పూర్తి చేయాలని, పనులు ప్రారంభించిన రెండున్నరేళ్లలోగా ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఎక్కువ సమయం ఫ్లైఓవర్ పనులకే కేటాయించాలని సూచించారు.పదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఆరేళ్లలో 6 కి.విూ కారిడార్ పూర్తి చేయలేకపోవడం తెలంగాణకు అవమానకరం. ఈ విషయంలో కేటీఆర్ సిగ్గుపడాలి. హైదరాబాద్`విజయవాడ హైవేతో పాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశాం. ఈ కారిడార్ అంశంపై గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లో పదిసార్లు ప్రశ్నించారు. ఆదివారం అయినా సరే అధికారులందరూ వచ్చి ఈ కారిడార్ అంశంపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరా. పది రోజుల్లో ఉప్పల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు కలిసే వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తాం. నవంబరు మొదటి మాసంలో ఫ్లైఓవర్ పనులు మొదలుపెట్టి 18` 20 నెలల్లో పూర్తి చేస్తాం. డిసెంబరులో మూసీ పనులు మొదలుపెడతాం. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.7వేల కోట్లు వడ్డీ కడుతున్నాం. సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు మంత్రి పదవి ఇస్తే.. ఆ తర్వాత మంత్రి పదవి కోసం పార్టీ మారారు. సభలో మహిళలు కంటతడి పెట్టలేదు, నవ్వుకున్నారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉంటే ఉండాలి లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నవంబర్‌లో అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.