తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు
వరంగల్ : చిట్యాల మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు. మహిళల సమాధానంతో బాబు నోరెళ్లబెట్టారు. తెలంగాణపై కేంద్రానికి చెప్పాల్సింది. చెప్పామని బాబు చెప్పారు. మహిళలు ఆగ్రహంతో ‘ జై తెలంగాణ’ నినాదాలు చేశారు. దీంతో బాబు ఖంగుతిన్నారు.