‘తెలంగాణ’పై స్పష్టమైన ప్రకటన చేయాలి

ఆదిలాబాద్‌, జూలై 29: ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 938వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షను గుర్తించన పార్టీలను ప్రజలు క్షమించరని వారు హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు విషయమై నాన్చుడు ధోరణిని వీడనాడి ఎలాంటి కాలయాపన చేయకుండా తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేశారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రాంతంలోని పార్టీలు, నాయకులు ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని వారు డిమాండ్‌ చేశారు.