తెలంగాణలో క్రీడలకు పెద్దపీట

5

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):

తెలంగాణలో ఇకపై క్రీడలకు ప్రాముఖ్యత నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.బుధవారం హైదాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 65వ జాతీయ పోలీస్‌ అథ్లెటిక్స్‌ విూట్‌ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

56 ఏళ్ల తర్వాత పోలీస్‌ అథ్లెటిక్‌ విూట్‌ జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. 60 ఏళ్ల సీమాంధ్ర పాలనలో ఏనాడు క్రీడల గురించి గానీ, క్రీడాకారుల గురించి గాని ఏ ఒక్కనాయకుడు కూడా పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సీఐఎస్‌ఎఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ చేతుల విూదుగా సీఆర్పీఎఫ్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌ ట్రోఫి అందుకుంది. ఈ వేడుకల్లో ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి పద్మారావుతోపాటు డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.