తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భగభగమండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌లో 42 డిగ్రీలు, మెదక్‌, నల్లగొండ, కరీంనగర్‌, రామగుండంలో 41 డిగ్రీలు, హైదరాబాద్‌, రంగారెడ్డిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.