తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మంది సిబ్బందితో కౌంటింగ్‌లో పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనంతరం ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. ఉదయం 9 గంటల కల్లా ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. శేరిలింగంపల్లిలో గరిష్టంగా 42 రౌండ్లు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 12 రౌండ్లు ఉంటాయి. తెలంగాణలో 199 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హైదరాబాద్‌లో 13 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను ఈసీ నిషేధించింది. అలాగే ఇవాళ విజయోత్సవాలకు అనుమతిని నిరాకరించారు.