తెలంగాణలో బాగుపడుతున్న పల్లెలు
తెలంగాణలో బాగుపడుతున్న పల్లెలు
వనపర్తి బ్యూరో అక్టోబర్17( జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్రం లో పక్కా ప్రణాళికతో గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన తో బాగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారంగ్రామంలో పర్యటించి ప్రజలను మిగిలిపోయిన సమస్యలు అడిగి తెలుసుకుంటు వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో
కరంటు, తాగునీళ్లు, పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారo అయ్యాయని,ప్రతి గ్రామపంచాయతీకి చెత్త సేకరణ, ఇతర అవసరాలకు ఒక ట్రాక్టర్ చెట్ల పెంపుకు ఒక నీటి ట్యాంకర్ ను అందించామని తద్వారాహరితహారం కింద రహదారుల పక్కన చెట్ల పెంపకం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశామన్నారు.సాగునీటి రాకతో గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు.గ్రామాలకు వలస పోయిన ప్రజలు తిరిగి వస్తున్నారని తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అపరిశుభ్రమైన తాగునీటితోనే ఎక్కువ వ్యాధులు ప్రబలుతున్నాయని మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తున్నమని చెప్పారు.విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో తొమ్మిదిన్నరేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని,అభివృద్ది పనులు కొనసాగాలంటే పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.