తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం పదకొండు దాటిందంటే కడప నుంచి బయటకు రావడంలేదు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది. రామగుండం-44, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌-43, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ-42, హైదరాబాద్‌-41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీమాంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.