తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం
ఈ నెల 16న జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర సున్నితమైన అంశాలని, వాటిపై పార్టీ సమావేశంలో చర్చ ఉండదని పునరుద్ఘా టించారు. సున్నితమైన ఈ సమస్యను పరిష్క రించేందుకు పార్టీ హైకమాండ్ యత్నిస్తోందని తెలిపారు. తెలంగాణపై శాశ్వాత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, దానిపై రాష్ట్ర స్థాయిలో చర్చ ఉండదని అన్నారు. తెలంగాణపై ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశం గురించి కేంద్ర ¬ం శాఖ నుంచి లేఖ అందిన తర్వాతే.. భేటీకి ఎవరు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈనెల 16న పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్న ఎల్బీ స్టేడియాన్ని బొత్స సోమవారం సందర్శించారు. సమావేశ నిర్వహ ణకు జరుగుతున్న భారీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బొత్స విూడియాతో మాట్లాడుతూ.. విస్తృత స్థాయి సమావేశానికి 10 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న
పథకాల పనితీరుపై ఈ సదస్సులో చర్చిస్తామని వెల్లడించారు. తెలంగాణపై చర్చ ఉండబోదని తెలిపారు. తెలంగాణపై చర్చించాలని ఆ ప్రాంత ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించగా.. వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ, చర్చించబోమన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర సున్నితమైన అంశాలని, వాటిని హైకమాండ్ పరిశీలిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సవిూక్షించి, మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు బొత్స వివరించారు.