తెలంగాణ అన్నప్పుడే వేరే ఉద్యమాలు: నారాయణ
కరీంనగర్: తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడే వేరే ఉద్యమాలు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాయలసీమ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎప్పుడూ లేవని ఆయన తెలియజేశారు. కాగా, సెప్టెంబర్ 30న నిర్వహించే’ హైదరాబాద్ మార్చ్’కు తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.