తెలంగాణ అభివృద్ధి టి.ఆర్.ఎస్. తోనే సాధ్యం
-మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి
రుద్రంగి నవంబర్ 25 (జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధి టి.ఆర్.ఎస్.పార్టీ తోనే సాధ్యం అని తెలంగాణా రాష్ట్ర మార్కుఫెడ్ చైర్మెన్ లోక బాపురెడ్డి అన్నారు.ఆయన ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ టి.ఆర్.ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన రమేష్ బాబును మరొక్కమారు అవకాశం ఇచ్చి తమ ఓటును టి.ఆర్.ఎస్ పార్టీకి వేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చెందుర్తి జెడ్.పి.టి.సి అంబటి గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షుడు గట్ల మీనయ్య,కేసిరెడ్డి నర్సారెడ్డి,మాడిశెట్టి ఆనందం,మంచే రాజేశం,అల్లూరి లచ్చిరెడ్డి, ఆకుల గంగారాం, లతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.