తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ — జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య
టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగని ఎంతో విశిష్టత కలియదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి మండలంలోని గోలియా తండా గ్రామపంచాయతీ లో స్థానిక సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జరుపుకునే ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దసరా,బతుకమ్మ పండుగను మహిళలు మహిళలు యువతులు ఎంతో వైభవంగా జరుపుకుంటారని రాష్ట్రవ్యాప్తంగా వారందరినీ ఆనందపరచడానికి పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు .ప్రతి ఆడబిడ్డ మొహంలో చిరునవ్వును చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆకాంక్ష అని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ పండుగ జరుపుకునేవాళ్ళం అని, నేడు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఆ ఘనత
టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాతే రాష్ట్ర సంస్కృతి,పద్దతి,యాష,బాషకు గౌరవం దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత, గ్రామపంచాయతీ కార్యదర్శులు, నాయకులు బోడ మంగీలాల్ నాయక్, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.