తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌


హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ మాట్లాడుతూ… భౌగోళిక తెలంగాణ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించిన సోనియాను ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తున్నానన్నారు. అనారోగ్యం తో ఉన్న సోనియాని ఈడీ పిలవడంపై గద్దర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు గ్రామాలకు వెళ్లి సోనియా గాంధీ గూర్చి చెప్పాలన్నారు. గ్రామాలకు వెళ్ళాలని కాంగ్రెస్‌ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పా మనకి వేరే మార్గమే లేదన్నారు. పార్లమెంట్‌ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతకడం అవసరం అని తెలిపారు. సోనియాకి కష్టం వచ్చిందని పల్లెపల్లెకి వెళ్లి ప్రచారం చేయండని కాంగ్రెస్‌ నేతలకు గద్దర్‌ సూచన చేశారు.