తెలంగాణ ఎపి అజెండాకు సోనియా కుట్ర
తెలంగాణ గురించి మాటైనా మాట్లాడని కాంగ్రెస్ అధినేత్రి
చంద్రబాబు ఆలోచనకలు ప్రతిరూపంగా సోనియా వ్యాఖ్యలు
జగిత్యాలలో విూడియా సమావేశంలో ఎంపి కవిత
జగిత్యాల,నవంబర్24(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అజెండాను తెలంగాణలో తేవాలని కుట్ర చేస్తున్నారని ఎంపీ కవిత ఆరోపించారు. సోనియాగాంధీ హైదరాబాద్ వచ్చి తెలంగాణ రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడకుండా.. పక్క రాష్ట్రం గురించి మాట్లాడారని విమర్శించారు. సోనియాగాంధీ మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు మాటల్లా ఉన్నాయని ఎద్దేవాచేశారు. చంద్రబాబుతో పొత్తు తరవాత వారు ఏం మాట్లాడినా బాబు ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం జగిత్యాలలో జరిగిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… సోనియాగాంధీ మాటలు చూస్తే చంద్రబాబునాయుడు మాటలుగా ఉన్నాయన్నారు. సోనియాలాగా మేము ఢిల్లీలో ఒకటి రాష్ట్రంలో ఒకటి మాట్లాడమని, మేము ఎక్కడైనా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నామని కవిత అన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర ఏజండాను తెలంగాణ రాష్ట్రంలో తేవాలని కుట్ర చేస్తున్నారని ఆమె అన్నారు. 26వతేదీన జగిత్యాలలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆమె టీఆర్‌ఎస్ శ్రేణులను కోరారు.సోనియాలా తాము దిల్లీలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి మాట్లాడబోమని, ఎక్కడైనా తెలంగాణ హక్కుల కోసమే మాట్లాడతామని చెప్పారు. జగిత్యాల జిల్లా ఎవరూ అడగకుండానే కేసీఆర్ ఇచ్చారని, ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నా తాను జగిత్యాలలో అభివృద్ధి చేశానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ¬రా¬రీగా జరుగుతున్నాయన్నాయని అన్నారు. జీవన్ రెడ్డికి కేసీఆర్‌పై విమర్శల చేయడం తప్ప ఏవిూ రాదని ఎద్దేవాచేశారు. తెలంగాణ హక్కుల గురించి సోనియా గాంధీ మాట్లాడలేదని, పక్కరాష్ట్రం గురించి మాట్లాడారని ఎవరిని అడిగినా చెబుతారని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇదిలావుంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ కవిత పర్యటించారు. . పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల అభ్యర్థి సంజయ్ కుమార్, కోరుట్ల అభ్యర్థి విద్యాసాగర్ రావు, చొప్పదండి అభ్యర్థి రవి శంకర్ కలిసి ఎంపీ కవిత శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అన్ని విషయాలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి కట్టి వస్తున్నాయని, వాళ్లేం చేశారో.. పద్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తాము నాలుగేళ్ల పాలనలో ఏం చేశామో ప్రజల ముందు ఉందని చెప్పారు. ఎన్నికలు రాగానే నాయకులు అభూత కల్పనలతో వస్తారని హెచ్చరించారు. ఏది వాస్తవం.. ఏది అవాస్తవమో గ్రామాల్లో చర్చపెట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, మనకు తెలివి లేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆ నాడు అన్న మాటలను గుర్తుచేశారు. దేశంలోనే 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చేది తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యక్తిగత కరెంటు వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని వెల్లడించారు.




