తెలంగాణ ఏర్పాటులో సుష్మా ది కీలక భూమిక

 

* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరటాల

కరీంనగర్   ( జనం సాక్షి ) :
తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బిజెపి నేత , మాజీ కేంద్ర మంత్రి, సుష్మా స్వరాజ్ అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామయ్య కొనియాడారు . తెలంగాణ చిన్నమ్మ వర్ధంతిని పురస్కరించుకొని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం జ్యోతి నగర్ లోని సుష్మ స్వరాజ్ చౌక్ లో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత విదేశాంగ విధానానికి సమూల సంస్కరణలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. భారతీయ సంస్కృతికి పర్యాయపదం, మృదుభాషి, గొప్ప వక్త, తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించి తెలంగాణ చిన్నమ్మ గా ప్రసిద్ధి చెందిన గొప్ప నేత అని కొనియాడారు. పద్మ విభూషణ్, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ సేవలు మరువలేని అన్నారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లో తనదైన శైలిలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీవ్ర కృషి చేసిన సుష్మా స్వరాజ్ సేవలను టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి , 57వ డివిజన్ బండ సుమ రమణారెడ్డి ,వెస్ట్ జోన్ బిజెపి ఒబిసి కార్యదర్శి పబ్బాల ఆంజనేయులు,బిజెపి మహిళ మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడి చైతన్య ,వెస్ట్ జోన్ ప్రధానకార్యదర్శి మామిడి రమేష్ ,బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదుగంటి కుమార్ బిజెపి డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.