తెలంగాణ కోసం ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య యత్నం
ఆత్మకూరు : వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని గురుగొండ గ్రామ పరిధిలోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న కె. నీరజ్ భరద్వాజ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం 8:30గంటల ప్రాంతంలో కళాశాలకు చేరుకున్న అతడు తనవెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని అంటించుకున్నాడు.తోటి విద్యార్థులు అతని కేకలను విని మంటలను ఆర్పారు. తాను తెలంగాణ కోసం ఆత్మహత్యకు మత్నించినట్లు నీరజ్ తెలిపాడు. ఒక పేపరుపై తన తండ్రి పేరు, ఫోన్‌నెంబరు రాసి పెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విద్యార్ధి హన్మకొండలోని గోపాల పురానికి చెందినవాడు. ఆత్మకూరు పోలీసులు సంఘలన స్థలానికి చేరుకుని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.