తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. సీమాంధ్ర చానెల్స్‌ అసత్య ప్రసారాలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దని కోరారు.