తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

నడిరోడ్డుపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి
రాయికల్‌ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది . వివరాల్లోకి వెళ్తే రాయికల్‌ మండల కేంద్రంలో వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్న రాజరపు జనార్దన్‌ (60) తెలంగాణకై జరిగిన ప్రతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. తమ జీవితాలు నాశనమైనా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర రాష్ట్ర రాజకీయాల కారణంగా రాకపోయేసరికి తీవ్ర మనస్తాపంతో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక శివాజీ విగ్రహం వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ హటత్పరిమాణానికి చుట్టుపక్కల ఉన్నవారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న జనార్ధన్‌ దేహాన్ని 108 తో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా రాత్రి 8గంటల సమయంలో జనార్దన్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పమ్మెల్యే రమణ ఏరియా ఆసుపత్రికి చేరుకొని జనార్ధన్‌ కుటుంబాన్ని పరామర్శించారు. సుమారు 700 పైబడి తెలంగాణకై బలిదానాలను కోరిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇంకెన్ని బలిదానాలు కోరుతుందోనని ప్రజలు దిగ్బ్రాంతి చెందుతున్నార