తెలంగాణ చౌక్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ చౌక్‌లో బీసీ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కుల సంఘాల చైర్మన్‌ జీఎస్‌.ఆనంద్‌ జెండా ఆవిష్కరించారు.  కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మళ్లి వచ్చే స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొవాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నారాయణగౌడ్‌, విశ్వశాంతి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ అంజనేయులు, విద్యార్థులు శ్రీనివాస్‌, రాకేష్‌, తిరుపతి, సంజీవరావు, కుల సంఘాల జేఏసీ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.