తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ కె. సృజన

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి);

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. సృజన జిల్లా అదనపు ఎస్పీ ఎన్ .రవి, డి. ఎస్పీ పి. వేంకటేశ్వర్లు, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్ తో కలసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయ అధికారులతో, సిబ్బంది తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతం ను భారత యూనియన్ లో విలీనం చేసే క్రమంలో స్వాతంత్ర సమర యోధులు చేసిన పోరాటం ను, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేపట్టి హైదబాద్ ప్రాంతం ను భారత యూనియన్ లో కలిపేందుకు చేసిన ప్రత్యేక చోరువను కొనియాడారు. ఆనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయ సిబ్బందికి అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీష్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, గద్వాల్ సి. ఐ శ్రీనివాస్, ఆర్ ఐ లు వెంకట్,హరీఫ్ ఎస్సై లు ఆనంద్, షుకూర్, విక్రమ్, చంద్ర కాంత్, విజయ్ భాస్కర్ కార్యాలయ అధికారులు, ఐటీ , డీసీ ఆర్బి, ఎస్బి, విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు