తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి.
ఘనంగా నివాళులర్పించిన దండోరా నాయకులు.
తెలంగాణ కోసం తన పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా ఆద్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు,తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు,బహుజన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ హాజరై
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కల్మూరి రాములు మాదిగ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవిని తెలంగాణ కోసం తృణప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడని అన్నారు. 1969 లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి, తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి, తన ఇంటిని సైతం తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసిన మహోన్నత నేత కొండ లక్ష్మణ్ బాబూజీ అని అన్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు బాకి రేణుక,తాలూకా అధ్యక్షులు భీమయ్య మాదిగ, ములకలపల్లి శ్రీను, కృష్ణయ్య, పాదాల మధు, తెలంగాణ దండోరా నాయకులు తదితరులు పాల్గొన్నారు.