తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్న కేంద్రం – టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రావు

కాటారం,అక్టోబర్ 11(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావుతీవ్రంగాదుయ్యబట్టారు.మంగళవారం కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని పెంచి పోషిస్తూ అశాంతికి కారణం అవుతు న్నదని ఆరోపించారు.దేశంలో బిజెపి ప్రభు త్వం అప్రజాస్వామిక పాలన కొనసాగి స్తున్న దని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న దని కిషన్ రావు తీవ్రంగా విమర్శించారు.ఆర్థిక స్వావలంబనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల పరిపాలన వ్యవస్థ తీవ్రంగా కుంటుపడుతున్నదని కిషన్ రావు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్ని కకు కారణం బిజెపి నేనని 18 వేల కోట్ల కాం ట్రాక్టు డబ్బులకు అమ్ముడుపోయిన రాజ గోపాల్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్ప డుతూ ఉపఎన్నికకు కారణమ య్యాడని, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కేంద్రం తీవ్రంగా వివక్ష చూపు తు న్నదని కిషన్ రావు పేర్కొన్నా రు.బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నాలు గు సార్లు చేసిన పాదయాత్రతో ఒరిగిం దేమీ లేదని,ప్రజలను తప్పుతో పట్టించడానికి ఈ పాదయాత్రలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి నిధులు ఇవ్వలేదని,జిఎస్టి నిధులు, కళాశాల లు, యూనివర్సిటీలు ఇవ్వలేదని ఆయన ఆరో పించారు.బిజెపి ప్రభుత్వం మసిబూసి మారే డు కాయ చేస్తున్నదని,మునుగోడులో జరగ నున్న ఉప ఎన్నికలలో బిజెపికి ఓటు వేయ వద్దని,తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కిషన్ రావు పిలుపుని చ్చారు. బిజెపి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఐటి పరిశ్రమ కుంటుపడే అవకాశం ఉన్నదని,ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే సూచనలు ఉన్నాయ న్నారు.కేసీఆర్ రైతు పక్షపాతి,అందరివాడని, చరిత్రకారుడని,రైతు సంక్షేమం కోసం కేసీ ఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు,నల్ల గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ను రూపుమా పడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల నీరు ఏర్పాటు చేయించిన ఘనత కేసిఆర్ కే దక్కు తుందని కిషన్ రావు పేర్కొన్నారు.అశాంతి రేపుతున్న బిజెపికి ఓటు వేయవ ద్దని మత రాజకీయ వ్యవస్థను రూపు మాపాలని కిషన్ రావు పిలుపు నిచ్చారు. కాటారం సింగిల్ విం డో చైర్మన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్ని కకు కారణం బిజెపి నేనని,18 వేల కోట్ల రూపాయ ల కాంట్రాక్ట్ పనుల కోసం రాజగోపా ల్ రెడ్డి రా జీనామా చేశాడని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీ ఆర్ చేస్తున్న అభివృద్ధి వైపు చూస్తు న్నారని, మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నారాయణరెడ్డి కోరారు.అభి వృద్ధి సంక్షేమ పథకాల అమలు టిఆర్ఎస్ ప్రభుత్వ వళ్లనే సాధ్యమని, మునుగోడులో ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వారితో  అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు.అధికార పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నారాయణరెడ్డి సూచించారు బిజెపి అధ్యక్షుడు బండి సన్ని బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రతో రాష్ట్ర ప్రజలకు ఒరిగే దేంలేదని,ప్రజలను మాయమాటలు చెప్ప డానికి పాదయాత్ర మొదలు పెట్టార నితేలి పోయింది తీవ్రంగా విమర్శిం చారు.రాష్ట్ర అ భివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలే దని,పత్రికల్లో వార్తలు, ప్రకటనలు ఇస్తున్నారే తప్ప అభివృద్ధికి నిధులు కేటాయించడం లేద ని తీవ్రంగా విమర్శించారు.తెలంగాణ రాష్ట్రా న్ని అన్ని రంగాల్లొ అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ వెంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నా రని నా రాయణరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.వి లేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నా యకులు మల్లేష్ యాదవ్,గోగు రాజేష్ రా ము,ఆత్కూరి పవన్ ఉన్నారు.