తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక
ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని అడ్డుకున్న సమైక్య పాలకులు ఇప్పుడు విడిపోయాక కూడా తమ కుట్రలను వీడడం లేదని అన్నారు. బుధావారం నాడాయన విూడియామిత్రులతో మాట్లాడుతూ చంద్రబాబు, వైకాపా నేత జగన్‌ల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.  ఆంధ్రప్రదేశ్‌లలో కట్టిన సాగునీటిప్రాజెక్టులు, వాటికి జరిగిన నీటికేటాయింపులు సహా అన్నిరకాల నీళ్ల దోపిడీపై చర్చ జరగాలన్నారు. తమ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చర్చకు సిద్ధంగా ఉన్నానని

చేసిన ప్రకటనకు స్పందించాలన్నారు. ఆయా పార్టీల తెలంగాణ నేతలు దీనిపై తమ వైఖరి ప్రకటించి, ఆ పార్టీల నుంచి బయటపడాలన్నారు. ఇంకా ఆంధ్రా తొత్తు పార్టీలకు ఊడిగం చేస్తారా అన్నది తేల్చుకోవాలన్నారు. ఇదిలావుంటే  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అక్కడి రాజకీయాపార్టీలు చర్చకు సిద్ధమేనా అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. ఆంధప్రదేశ్‌ మంత్రివర్గం తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే ఓర్వలేక కళ్లమంటతో తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలంటూ ఎపి కేఇనేట్‌ తీర్మానం చేసిందని మంత్రి జోగు రామన్న విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచి కుట్రలకు పాల్పడుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. తెలంగాణను ఎండబెట్టింది, పాలమూరు రైతుల ఉసురు తీసింది, నల్గొండ ఫ్లోరైడ్‌ మహమ్మారికి కారణం ఆంధ్రనేతలేనన్నారు. ఆంధప్రదేశ్‌లో కట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని, అలాగే, పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఎంతో.. ఇప్పుడు ఎంతకు పెంచారో చెప్పాలన్నారు. హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ఎవరి అనుమతులున్నాయని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు, నల్గొండ జిల్లాలకు నీళ్లు ఇవ్వడం తప్పా..? అని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌ను ఎండబెట్టి పెన్నా బేసిన్‌కు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, వైకాపా నేత జగన్‌ దీక్షపై తాము పైచేయి సాధించాలన్న కుటిల రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను బలిచేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరు పార్టీలు రాజకీయ ఎత్తుగడలతో ప్రాజెక్టులను రాజకీయం చేస్తోందన్నారు. న్యాయస్థానాల పేరు చెప్పి ఏళ్లకు ఏళ్లు పనులు సాగకుండా చూడాలనుకుంటోందని ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయపార్టీలకు తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు భయపడబోరన్నారు. సమైక్యపాలనలో ఆంధ్రనేతలు శ్రీశైలం ప్రాజెక్టు పేరుతో కృష్ణానదిని కబళించారని ఆరోపించారు. అన్యాయంగా గోదావరిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, కృష్ణా బేసిన్‌కు దక్కాల్సిన నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ సర్కారు చెబుతోందని, అదే ఫిర్యాదు లేఖలో తెలంగాణ, ఆంధ్రల్లో ఉన్న ప్రాజెక్టులకు జరిగిన నీటికేటాయింపులపై సమగ్ర విచారణ చేయించాలని కూడా కోరాలని సూచించారు.  బచావత్‌, బ్రిజేష్‌ ట్రెబ్యూనల్‌లో చెప్పినట్లుగానే తాము ప్రాజెక్టుఉల కట్టుకుంటున్నామని జోగు అన్నారు. పట్టిసీమకు పరిహారంగా తెలంగాణకు ఆంధప్రదేశ్‌ 45 టీఎంసీల నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఇచ్చిన జీవోల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. ఇకనైనా తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడాలన్నారు. సమైక్య రాష్ట్రంలో దోచుకున్న విధంగా ఇంకా చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు.