తెలంగాణ బాగు పడలేదన్న విషయం బాధ పెడుతోంది
ఈ ప్రాంత బాగు కోరి నష్టమైనా విభజన నిర్ణయం తీసుకున్నాం
తల్లిలా నా మనసు ఆందోళన చెందుతోంది
ఈ సర్కార్‌ను పారదోలే సమయం వచ్చింది
ప్రజల కలలను సాకారం చేసుకుందాం
మేడ్చెల్ సభలో సోనియా ఉద్వేగపూరతి ప్రసంగం
మేడ్చెల్,నవంబర్23(జనంసాక్షి): రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. అయితే ఇచ్చిన తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదన్న విషయం తనను ఎంతగానో కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నానంటూ పలకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే సందర్భంలో ప్రత్యేక¬దాతో ఎపిని ఆదుకుంటామని ప్రకటించామని అన్నారు. దీనికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, విూ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం విూరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా? అని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హావిూ చట్టాన్ని కూడా తెరాస అమలు చేయలేదు. కేసీఆర్ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులే చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదన్న విషయం బాధను కలగ చేస్తోందన్నారు. చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో అలా.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పొడుస్తున్న పొద్దువిూద నడుస్తున్న కాలమా
మరోమారు ఉత్తేజం నింపిన గద్దర్
పొడుస్తున్న పొద్దు విూద నడుస్తున్న కాలమా’ అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్టోద్యమ్ర సమయంలో ప్రజాగాయకుడు గద్దర్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. ఆ పాట ఎక్కడ వినపడ్డా.. తెలంగాణ ఉద్యమకారుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మేడ్చల్ కాంగ్రెస్ సభలో అలాంటి అనుభవమే ఆవిష్కృతమయ్యింది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దర్.. ‘పొడుస్తున్న పొద్దు విూద’ అంటూ తన గళాన్ని మళ్లీ విప్పారు. దీంతో చప్పట్లు, ఈలలతో కార్యకర్తలు సభను ¬రెత్తించారు. ఆనాటి ఆకాంక్షలను గుర్తు చేసేలా సభనుద్దేశించి గద్దర్ ప్రసంగించారు. కాలాన్ని బంధించి కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ పసిబిడ్డలాంటి తెలంగాణకు పాలు ఇవ్వకుండా పాలకులు పస్తులు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చి జోలపాట పాడుతున్నారన్నారని ఆరోపించారు. అంతకుముందు ఆమె సోనియాను కలసి అభినందనలు తెలిపారు.
డిసెంబర్12న పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం
మేడ్చెల్‌లో ఉత్తమ్ ప్రకటన
డిసెంబర్ 12న ప్రజాకూటమి లేదా పీపుల్స్ ఫ్రటం ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిరా/- నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడబోతున్నామని అన్నారు. మేడ్చెల్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా కూటమి పేరుతో ఎన్నికల్లోకి వెళ్తున్నామని అన్నారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థుల గెలుపునకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. డిసెంబర్ 12న పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు నెలకు 3వేల భృతి, 1500 పెన్షన్ రూ.3 వేలు చేస్తాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఎవరో ప్రభావితం చేస్తారని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పందంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర కేసీఆర్ తాకట్టుపెట్టారని ఆరోపించారు. డిసెంబర్12 తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను ఓడించేందుకు ఉమ్మడిగా వస్తున్న తమకు అంతా సహకరించి కదలాలని పిలుపునిచ్చారు.
నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలడానికే వచ్చాం
కలసి పోరాడాలన్న ఆలోచనకు బీజం వేసింది తానే: రమణ
తెలంగాణలో ప్రజాకంటక కెసిరా/- ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్‌తో కసలి జట్టుకట్టాలన్న ప్రతిపాదన తొలగి చేసింది తానేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కాంగ్రెస్ వేదిక పంచుకోవడం ఇదే తొలిసారని అంటూ తెలంగాణ ప్రజలకు నిరంకుశ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించేందుకు కలసి పోరాడాలని ముందుకు వచ్చామని అన్నారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి పీఠం విూద కూర్చోబెడతానని చెప్పిన దొర తానే ముఖ్యమంత్రి అయ్యాడని తీవ్రస్థాయిలో విమర్శించారు. 51 నెలల పరిపాలన తర్వాత అర్ధంతరంగా ప్రభుత్వాన్ని రద్దు
చేసి 105 మందితో తెలంగాణ సమాజంపైకి బయలుదేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచన తనదేనని వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌లో కోదండరాం, చాడ వెంకటరెడ్డి వద్ద ఓ ప్రతిపాదన తెచ్చినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడి ముందుకెళ్దామని తొలుత ప్రతిపాదించింది తానేనని రమణ వివరించారు. ప్రజాకూటమి ద్వారా విూ ముందుకు వచ్చామని, గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ పాలైందని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని మండిపడ్డారు. రాజకీయ సన్యాసమంటే పారిపోవడమేనని అన్నారు. నాయకుడు గెలిచినా..ఓడినా ప్రజాజీవితంలో ఉండాలన్నారు. ఇంత చెత్త సీఎం దేశంలోనే లేడని చాడ విమర్శించారు. తెలంగాణలో కూటమి గ్దదెనెక్కడం ఖాయమని స్పష్టం చేశారు.
సోనియాకు ఘన స్వాగతం పలికిన నేతలు
హైదరాబాద్ చేరుకున్నక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి బేగంపేట విమనాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా సోనియా తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ప్రచార కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఎక్కడా ఆమె సభల్లో పాల్గొనలేదు. కానీ, తెలంగాణ ప్రచారంలో పాల్పంచుకునేందుకు మాత్రం ఆమె అంగీకరించారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభకు సోనియాతోపాటు రాహుల్ గాంధీ కూడా వచ్చారు. దీంతో టీపీసీసీ నేతలు సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం సోనియా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే మరో విమానంలో రాహుల్ వచ్చారు. అక్కడ ఎంపిక చేసిన 21 మంది ఏఐసీసీ, టీపీసీసీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు.