‘తెలంగాణ బిడ్డకు చంద్రబాబు గళ్లపట్టే హక్కుంది’

హైదరాబాద్‌: తెలంగాణలో పుట్టిన పత్రి బిడ్డకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నిలదీసే హక్కుందని అవసరమైతే గళ్లపట్టే హక్కు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు అన్నారు. పిల్లనిచిన మామను వెన్ను పోటు పొడిచే స్థాయి మాకులేదని, మరి చంద్రబాబు స్థాయి ఏంటో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. బాబుది పిల్లనిచ్చిన మామను వెన్ను పోటు పొడిచిన స్థాయి అని విమర్శించారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేయడం వల్లే టీడీపీలో ఎర్రబెల్లికి టీ టీడీపీ ఫోరం అధ్యక్షుడి పదవి దక్కిన విషయం మరిచిపోవద్దని కేటీఆర్‌ అన్నారు. అసలు కేసీఆర్‌ లేకుంటే ఎర్రబెల్లి ఫోరం అధ్యక్షుడు అయ్యేవారా అన్ని ప్రశ్నించారు. కేసీఆర్‌ లేకుంటే చంద్రబాబు ఎర్రబెల్లిని గంజిలో ఈగలా కాలు కింద వేసి తోక్సేసేవాడు అని తెలిపారు.

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఇంటి ముందు ధర్నాకు మేం సిద్ధం కేసీఆర్‌ కూడా ధర్నాలో పాల్గోంటారు. మీపారీట నుంచి ధర్నాలో ఎవరు పాల్గోంటారు? అన్ని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థలు

టీడీపీ, వైఎస్సార్సీపీలు కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. అనుబంధ సంస్థలు కాకుంటే మీపై కేసులు ఎందుకు కొట్టి వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై కాకుంటే మీపై కేసులు ఎందుకు కొట్టి వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తే కాంగ్రెస్‌ చెబితేనే మేం చెబుతామని ఎందుకంటున్నారని నిలదీశారు. మీ నాయకులకు నాయకత్వ లక్షణాలు లేవా ?’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘మీనేతలు జై తెలంగాణ అని ఎందుకనరు’ అని నిలదీశారు.ఆస్తులపై విచారణకు సిద్ధమా?

కేసీఆర్‌ ఆస్తులపై విచారణకు సిద్ధం, మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని కేటీఆర్‌ ఎర్రబెల్లికి సవాలు విసిరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు , సీబీఐలలో ఎవరితోనైనా సరే విచారణకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని, మరి చంద్రబాబునాయుడు సిద్దమేనా అని అన్నారు.

బాబు జీవితంలో అధికారంలోకి రాడు

చంద్రబాబునాయుడు ఎన్ని పాదయాత్రలు చేసినా , దేశమంతా తిరిగినా తిరిగి అధికారంలోకి రావడం కల్లా అని కేటీఆర్‌ అన్నారు. పోలవరం, ఆర్డీఎస్‌, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరని కేటీఆర్‌ నిలదీశారు.

కావూరి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నం

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. కేబినెట్‌ పదవి కోసం కావూరి అంగలారుస్తున్నారని విమర్శించారు. అదే కేబినెట్‌ పదవిని కేసీఆర్‌ కాలిచెప్పుతో సమానంగా వదిలివేశాడని గుర్తు చేశారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కావూరికి లేదని ధ్వజమెత్తారు.

సురేఖకు మతి భ్రమించింది

వైఎస్సార్సీపీ నేత కొండా సురేఖకు మతి భ్రమించిందని , ఆమె పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని, పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకుని తెలంగాణను అడ్డుకున్నా తెలంగాణ ద్రోహి జగన్‌తో కలిసి, జగన్‌తో పనిచేస్తూ తెలంగాణకు అనుకూలమంటే సురేఖను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు.