తెలంగాణ భవన్‌లో సంబురాలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. సుమారు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. బాణాసంచా కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటున్నారు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణలో ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. మరోసారి టీఆర్‌ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రజలు పట్టం కట్టారు.