తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ సభను విజయవంతం చేయండి!

తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ సభను విజయవంతం చేయండి!

ముస్లిం ప్రజలకు పిలుపు…..————————————-
ఈ నెల 29న మందమర్రి లోని మంజునాథ పంక్షన్ హాల్ మందమర్రి (దొరల బంగ్లాలు)లో ఆదివారం సమయం ఉ. 11 గం.ల నుండి మ. 3-00, గం.ల వరకు ముస్లిం డిక్లరేషన్ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ముస్లిం ఆర్గనై్సేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొన్నది.ఈ సభకు వస్తున్న ముఖ్య అతిధులు ప్రొ|| అన్సారి, ఓయు , రిటైర్డ్, ప్రొపేసర్, & రాష్ట్ర అధ్యక్షులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటి
సయ్యద్. సలీంపాషా, తెలంగాణ మూమెంట్ విద్యార్థి నాయకులు ఓయూ , ముస్లిం జేఏసీ కన్వినర్
ఎస్.కె. యుసూఫ్ బాబ(స్కైబాబ) కవి, రచయిత, జేఏసీ కో కన్వీనర్
వక్తలులు గా వస్తున్నారని జేఏసీ పేర్కొన్నది.
మహ్మద్. యునుస్ ఫర్వేజ్,ఓయు , స్కాలర్, జాక్ రాష్ట్ర కో ఆర్డినేటర్
జీనత్ అజ్మి సయ్యద్, ఓయు రిసెర్చ్ స్కాలర్, జాక్ కోర్ కమిటి సభ్యులు సయ్యద్. నవాజ్, జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పాల్గొంటున్నారని కూడా కమిటీ తెలిపింది.
తెలంగాణలో ముస్లిం కమ్యూనిటి పెద్ద సమూహం దాదాపు 13% ఓట్లు కలిగిఉంది. ప్రతి నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు కలిగిఉండటమే కాకుండా రాష్ట్రంలో దాదాపు 40, నియోకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే నిర్ణాయకశక్తిగా ఉంది. అయినప్పటికి వీరిని ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు లాగానే చూస్తు అన్యాయం చేస్తువస్తున్నాయి. జస్టీస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమీషన్, రాష్ట్రంలో సుధీర్ కమీషన్, తెలంగాణ తొలి బీసి కమీషన్ ముస్లింల వెనుకబాటుతనాన్ని స్పష్టంగా తేల్చి చెప్పి ఉన్నాయి.
ముస్లింలు ఎన్నోచోట్ల దళితుల కన్నా వెనుకబడి ఉన్నారని జస్టీస్ సచార్ కమిటీ స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగ రంగాలలో అట్టడుగున పడి అల్లాడుతున్నారని గణాంకాలతో సహావివరించింది. 1924 వరకు ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్లో ఎస్సీ హెూదా కలిగి ఉన్న ఎన్నో
ముస్లిం కమ్యూనిటీలను స్వాతంత్య్రం తరువాత 1950లో ఆ హెూదా తొలగించి ఓపెన్ కేటగిరిలో వేసేసిన చరిత్ర ఉంది.బి.సి “బి” కేటగిరిలోని ముస్లింలు మిగతా బీసీ కులాలతో పోటీ పడి రిజర్వేషన్ అవకాశాలను పొందలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 2004 ఎన్నికల్లో 7%రిజర్వేషన్ కల్పిస్తామని హామి ఇచ్చి గెలిచిన కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ కూడా ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. గత 9 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు తాను రెండుమార్లు 12% రిజర్వేషన్ హామిఇచ్చి గంపగుత్తగా ముస్లింల
ఓట్లు వేయించుకుని ఏదో మొక్కుబడిగా అసెంబ్లీలో బిల్పాస్చాయించి కేంద్రంలోని బి.జె.పి, ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకున్నారు. వారు చెత్తబుట్టలో వేసేసారు. కేంద్రప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి పెట్టిన పాపాన పోలేదు. అన్నిబిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేసిన టి.ఆర్.ఎస్, బి.ఆర్.ఎస్ ముస్లిం రిజర్వేషన్ల పై ఒత్తిడి చేయలేకపోయింది.ఈడబ్ల్యూఎస్ ఉపయోగించుకుని ఎస్టీలకు 6%నుండి 10% పెంచిన తెలంగాణ ముస్లిం ప్రజల రిజర్వేషన్ల విషయంలో వివక్షకు పూనుకుంటున్నది. 2023, అక్టోబర్ 15న ఆర్బాటంగా విడుదల చేసిన బి.ఆర్.ఎస్, మ్యానిఫెస్టోలో ముస్లిం సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఉపాధి, రిజర్వేషన్ల పై ఎటువంటి బరోసా ఇవ్వలేని పరిస్థితి. తెలంగాణ సాధనోధ్యమ పోరాటంలో సబ్బండ వర్గాలతో కలిసి ముస్లిం ప్రజలు పోరాడారు. ఇప్పుడు రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన, దగాపడిన ముస్లింలుగా ఈ ఎన్నికలలో తమకు జరిగిన అన్యాయాలను అవలోకనం
చేసుకుంటూ ప్రధానరాజకీయ పార్టీలముందు ఈ సదస్సుద్వారా ఒక స్పష్టమైన “ముస్లిం డిక్లరేషన్ “మీముందు పెడుతున్నాం. ఈ సదస్సు కు అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఒక ప్రకటన లో తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జాయింట్ ఆక్షన్ కమిటి – మందమర్రి
కార్యనిర్వాహకులు అబ్దుల్ అజీజ్ 9948282899, ఎం.డి. ఇషాక్ 9052717846,
ఎం.డి. షరీఫ్, 6301019998,
ఎం.డి. జావిదాఖాన్ లు పేర్కొన్నారు