తెలంగాణ రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి. సీఐటీయు నాయకులు పారేపల్లి శేఖర్ రావు
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్. తెలంగాణ రైతు సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్ రావు కోరారు. స్థానిక అరిబండి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ అక్టోబర్ 01న శనివారం నాడు ఉదయం 10 గంటలకు నేరేడుచర్ల లోని విశ్వబ్రాహ్మణ సంఘం భవన్లో జరుగు మహాసభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించనునట్లు ఆయన తెలిపారు.గతంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామంటూ,కేసీఆర్ రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయలేదని, వెంటనే అమలు చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, రైతు వేదికలు కేవలం అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప రైతులకు ఉపయోగపడేటట్లు లేవని వెంటనే వాటిని రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లో అఖిల భారత రైతు సంఘాల పోరాటంలో ఎంతోమంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారని,వారి ప్రాణ త్యాగఫలమే కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు రద్దయాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్,సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి,పిఎసిఎస్ పాలకీడు డైరెక్టర్ పాతూరి శ్రీనివాసరావు,ఉప్పుగంటి చిట్టిబాబు,గుర్రం ఏసు,తదితరులు పాల్గొన్నారు.