తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జనంసాక్షి (జులై 26):
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇ అన్నారు మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆషాడ మాసం సందర్భంగా ఆరెకటిక సంఘం, మాత శిశు సంరక్షణ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ లో సభాపతి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం దంపతులు బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా కలిసి మెలిసి బోనాల పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజల సుఖశాంతులతో జీవించాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area