*తెలంగాణ సామాజిక రచయితల సంఘం మండల కన్వీనర్ గా వెంగల రణధీర్*.
రేగొండ (జనం సాక్షి):
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రేగొండ మండలం కన్వీనర్ గా రేపాక గ్రామానికి చెందిన వర్ధమాన కవి, రచయిత రణధీర్ ని నియమించినట్లు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు కామిడి సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావుల రాజేశంలు తెలిపారు.ఈమేరకు వారికి నియామక పత్రం అందజేశారు.ఈసందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి రచయితలు మార్గదర్శకులు అని,ఒక్కసిరా చుక్క లక్షమెదళ్ళను కదలిస్తూవుందని,రచయితలు,కవులు సామాజిక సమస్యల మీద రచనలు చేసి సమాజ వికాసానికి కృషి చేయాలని అన్నారు.ఇటీవలి కాలంలో రణధీర్ అనేక లేఖలు,కవితలు రాసి తనకంటూ గుర్తింపు పొందారు అని, వారి ప్రతిభను గుర్తించి వారిని నియమించినట్లు వారు తెలిపారు.తన నియామకం కి సహకరించిన రాష్ట్ర సహ అధ్యక్షుడు కామిడి సతీష్ రెడ్డి, రావుల రాజేశంకి వారు ధన్యవాదాలు తెలిపారు.జిల్లాలో రచయితల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.