తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలంలోని బోన కొల్లూరు గ్రామంలో టిడిపి మండల ఇన్చార్జ్ శ్రావణ బోయిన బాల నర్సయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఉన్న సమయంలోనే ప్రతి ఊరికి సీసీ రోడ్డు. ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్. ప్రతి ఊరికి తాగునీటి కోసం బోరు బాయి వేసిన ఘనత తెలుగుదేశం దే అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు . మళ్లీ తెలుగుదేశం పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని తిరుగులేని అభివృద్ధిలో నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు. బద్దిపడగ బాల్రెడ్డి . గ్రామ కార్యదర్శి బోదాసు శేఖర్. కార్యకర్తలు సొప్పరి స్వామి. బోదాస్ మల్లయ్య. కొమ్మరి చంద్రం. భయ్యాల రాంబాబు. మల్లయ్య ఉన్నారు.