తెలుగు ప్రజలకు గవర్నర్‌, సిఎం జగన్‌ శుభాకాంక్షలు

దీపావళితో ప్రతి ఇంటా ఆనందాలు వెలగాలని ఆకాంక్ష

గవర్నర్‌తో అరగంటపాటు భేటీ అయిన జగన్‌ దంపతులు

అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల విూద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని జగన్‌ అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాలు దీపాలు వెలగాలని జగన్‌ ఆకాంక్షించారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి విూద వెలుగు, చెడు విూద మంచి, దుష్టశక్తుల విూద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీపావళి సందర్భంగా ఆంధప్రదేశ్‌ ప్రజలకు గవర్నర్‌ హరిచందన్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. కరోనా లాంటి విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త తీసుకోవాలి’ అని గవర్నర్‌ ఆకాంక్షించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో జగన్‌ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు జగన్‌, భారతి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. అరగంటపాటు వీరి భేటీ జరిగింది. మరోవైపు ఏపీలో దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయాన్ని ఇచ్చారు. ఎందుకంటే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.