తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన సెక్టోరియల్ అధికారులు..


పెగడపల్లి జనం సాక్షి ఆగస్టు 2 పెళ్లి మండల కేంద్రంలోని  ప్రాథమిక పాఠశాల యందు ప్రాథమిక  స్థాయిలో గుణాత్మక విద్యను అందించేందుకు తొలిమెట్టు దోహదపడుతుందని సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరల్ అధికారులు
దేవేందర్ రెడ్డి,అనుపమ పేర్కొన్నారు. తొలిమెట్టు కార్యక్రమంపై పెగడపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తొలి విడత శిక్షణ శిబిరాన్ని ఈరోజు సందర్శించారు. ఈ  కార్యక్రమంలో  కోర్సు డైరెక్టర్ సంపత్ కుమార్చారి,కాంప్లెక్స్ హెచ్ఎం  లచ్చయ్య,ఆర్పీలు సత్యం, వంశీ కృష్ణ, శ్రీనివాస్, రాజశేఖర్ పాల్గొన్నారు.